జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాసవి మాత ఆలయంలో ఏర్పాటుచేసిన మండపంలో మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు లంబోధరునికి అభిషేకం నిర్వహించారు. వెండి వినాయక ప్రతిమకు అన్నం అభిషేకం చేశారు. అన్నంతో గణేశుని ఆకారంలో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఇదీ చూడండి: అహ్మదాబాద్లో 'అభినందన వినాయకుడు'!