జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు నిరాడంబరంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది వినాయక చవితి అంటేనే అంగరంగ వైభవంగా సంబరాలు చేసేవారు. కానీ.. ఈ ఏడాది ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండుగ జరుపుతున్నారు. చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లోనే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. పూజాసామాగ్రి, పూలు, పండ్లు కొనడానికి వచ్చిన భక్తులతో మార్కెట్లలో సందడి నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణపతి ఆలయంలో చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?