జగిత్యాల జిల్లాలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఫలితంగా అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో ఉదయం ఐదు గంటలకే సహకార సంఘం వద్ద రైతులు చేరుకుని క్యూలో పాసు పుస్తకాలు ఉంచారు. రాయికల్, ఉప్పుమడిగెలో యురియా కోసం రైతులు బారులు తీరారు. నిన్న 850 టన్నుల యురియా జిల్లాకు చేరినప్పటికి అది ఏ మాత్రం సరిపోలేదు. ఒకటి, రెండు బస్తాలు దొరికినా అవి సరిపోవటం లేదని... సకాలంలో సరుకు అందకపోతే దిగుబడులు తగ్గిపోతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: అద్దె గర్భం కోసం ఇల్లు వదిలి పారిపోయింది