జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యమంతా తడిసిపోయింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాయికల్లో రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల-రాయికల్ రహదారిపై రైతులు అరగంటకు పైగా ఆందోళన చేపట్టారు.
జూన్ 11 తేదీ వచ్చినా ఇంకా ధాన్యం కొనలేదని.. రైతులను పట్టించుకోవట్లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఘటనాస్థలానికి వచ్చి హామీ ఇవ్వడం వల్ల వారు ఆందోళనను విరమించారు.
ఇవీ చూడండి: గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్ విజృంభణ!