ETV Bharat / state

మాకు పూర్తి డబ్బు ఇప్పించండి సారూ! - latest news of jagityala

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ జగిత్యాల జిల్లా మెట్​పల్లి అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. తాలు పేరిట కోత విధించి డబ్బులు పూర్తిగా చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

farmers protest in front of collectorate at jagityala
మాకు పూర్తి డబ్బు ఇప్పించండి సారూ!
author img

By

Published : Jul 6, 2020, 2:09 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వెల్లుల్ల గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సహకార సంఘం వారు ఎలాంటి పట్టీలు ఇవ్వకుండా ప్రస్తుతం తక్కువ డబ్బులు బ్యాంకులలో వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కొనుగోలు జరిగే సమయంలోనే తాలు పేరిట అదనంగా రెండు కిలోలు తీసుకున్నారని.. రైస్ మిల్లర్ల పేర్లు చెబుతూ మరల అదనంగా ఐదు కిలోలు కట్ చేశారంటూ వాపోయారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకుని రైతులకు న్యాయం చేసి పూర్తి డబ్బులు ఇప్పించాలని కోరుతూ కలెక్టర్​కు వినతి పత్రం అందించారు.

ఇదీ చూడండి:- నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.