ధాన్యం కొనుగోళ్లలో తాలు పేరిట కోత విధించడంతో అన్నదాతలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని రైతులు కళ్లకు గంతలు కట్టుకొని కొనుగోలు కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాలు లేకుండా ధాన్యాన్ని శుభ్రం చేసినా క్వింటాకి 6 నుంచి 7 కిలోలు కోత విధిస్తున్నారని వాపోయారు. దీనిపై అధికారులు స్పందించి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత