జగిత్యాల జిల్లాలో రైతుల యూరియా కష్టాలు అన్ని ఇన్నీకావు.. మేడిపల్లి మండలం వల్లంపల్లిలో ఉదయం నుంచి రాత్రి వరకు యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. ఒక లారీ యూరియా రాత్రి 7గంటలకు గ్రామానికి రావటం వల్ల క్యూలైన్లలోనే ఉన్న రైతులు యూరియాను తీసుకెళ్లారు. క్యూలైన్లలోనూ ఉన్న రైతుల కూడా పూర్తి స్థాయిలో యూరియా దొరకక పోవటంతో ఇబ్బంది పడ్డారు. అధికారులు యూరియా కొరతను తీర్చాలని వల్లంపల్లి రైతులు కోరుకున్నారు. ఒక ఆ గ్రామంలోనే కాదు.. జిల్లాలో అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం ఒక వ్యాగన్ యూరియా జిల్లాకు వచ్చినప్పటికీ రైతులకు వచ్చిన యూరియా ఏమాత్రం సరిపోవటంలేదని ఇంకా యూరియా తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీచూడండి: ఈటల గరంగరం... తెరాసలో హాట్ టాపిక్!