ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన - రైతుల ఆవేదన

ఆరుగాలం శ్రమించి అన్నదాతలు పంట పండించినప్పటి నుంచి విక్రయించే వరకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం అష్టకష్టాలు పడి పండించిన వరి ధాన్యం కొనుగోలు లేక ప్రతినిత్యం కుప్పల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

Farmers demand to buy grains at metpally karimnagar
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
author img

By

Published : Jun 2, 2021, 3:47 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులు కష్టాలపాలవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యంను విక్రయించాలనే ఆశతో వచ్చిన అన్నదాతలకు కొనుగోళ్లు సరిగా లేక నిరాశే మిగులుతోంది. కొనుగోళ్ల కోసం వచ్చిన రైతులు నెల రోజుల నుంచి కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన ధాన్యానికి అధికారులు తేమ శాతం, వివిధ కారణాలు తెలుపుతూ అమ్మకాలను జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు.

గత ఐదు రోజుల నుంచి రాత్రి పూట అకాల వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యం తడిసి ముద్దవుతుందని రైతులు వాపోయారు. మార్కెట్ యార్డు​లో మురుగు కాలువ కూడా లేకపోవడం వల్ల కురిసిన వర్షం ఎటూ వెళ్లకుండా కుప్పల వద్దే ఉంటుందని తెలిపారు. దీంతో ధాన్యం తడిసిపోతుందని అన్నదాతలు ఆవేదనకు లోనయ్యారు.

మార్కెట్ యార్డులో ప్రస్తుతం మూడు వేల క్వింటాళ్లకుపైనే అధికారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉంది. కానీ లారీల కొరతతో కొనుగోలు చేసిన ధాన్యం పేరుకుపోతోంది. ఇంకా రైతుల నుంచి సుమారు మూడు వేలకు పైగా క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రతి రోజూ కురుస్తున్న వర్షానికి మార్కెట్ యార్డు​లో ఉన్న ధాన్యం తడిసి… వడ్ల గింజల నుంచి మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

గత 20 ఏళ్ల నుంచి ఇలాంటి సమస్య ఎప్పుడు ఎదుర్కొలేదని కర్షకులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని అధికారులు, ధాన్యంను త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరుతున్నారు. లేదంటే రైతు ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: KTR: కేటీఆర్‌కు ట్వీట్‌.. గర్భిణీకి సకాలంలో వైద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.