జగిత్యాల కొడిమ్యాల మండలం రామ్సాగర్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. రామ్‌సాగర్ వాసులు మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. నీరులేక తమపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ నెరవేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?