ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ ను వాడొబోమని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామవీధుల్లో బతుకమ్మలతో మహిళలు ర్యాలీ నిర్వహించి వీధుల్లో బతుకమ్మ ఆడారు. పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్‌ను లక్ష్మీపూర్ నుంచి పారద్రోలి ఆదర్శంగా నిలవాలని గ్రామస్థులకు జేసీ రాజేశం సూచించారు. అంతకుముందు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఇదీ చూడండి: గాంధీ చేతికర్ర పట్టుకున్న పిల్లవాడు ఎవరో తెలుసా?