కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో కార్మికులకు ఛైర్ పర్సన్ సుజాత, కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో దుస్తులు, చేతి గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
ప్రతిరోజు వార్డులను శుభ్రం చేస్తూ.. చెత్తను సేకరిస్తున్న కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. జాగ్రత్తలు పాటిస్తూ వార్డులో శుభ్రం చేయాలని.. ప్రజలు కూడా కార్మికులకు సహకరించాలని కోరారు. చెత్తను ఆరుబయట పడవేయొద్దన్నారు. ఆటోలు వార్డులకు వచ్చినప్పుడు ప్రజలు ఇంట్లోని చెత్తను వారికి అందించాలని సూచించారు.
ఇదీ చూడండి: ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి