జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్ళలోకి చొరబడి బీరువాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. తాళం వేసి వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు సారగమ్మ వీధిలోని వొజ్జల సీతారామ శాస్త్రి ఇంట్లో ఐదు లక్షల నగదు, 11 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చిపిరిశెట్టి జనార్దన్ ఇంట్లో లక్ష డెబ్భై వేల నగదును దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం సాయంతో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: డ్రగ్స్ కేసులో ఫిల్మ్ ఇండస్ట్రీకి మినహాయింపెందుకు...?