వినాయక చవితి పర్వదినాన పూజా సామగ్రి, పూలు, పత్రిలు కొనుగోలు జగిత్యాల జిల్లా మార్కెట్కు జనం పోటెత్తారు. అదే సమయంలో టవర్ సర్కిల్ ప్రాంతంలో నిత్యజనగణమన ప్రారంభమైంది. బిజీగా ఉన్న వారంతా ఒక్కసారిగా జాతీయ జెండాకు వందనం చెబుతూ అక్కడే నిల్చుని సెల్యూట్ కొట్టారు. గతేడాది జగిత్యాలలో నిత్య జనగణమనను ప్రారంభించారు. ఈ దేశభక్తి చాటే అద్భుత దృశ్యాలు ఈటీవీభారత్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
ఇదీ చదవండిః గణేశుడికీ ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!