ETV Bharat / state

ఎస్సీలపై వివక్ష తగదు : సీపీఐ నేత నారాయణ

దేశంలో ఎస్సీల కుటుంబాలపై చిన్న చూపు బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగిత్యాల జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలను ఆయన పరామర్శించారు.

ఎస్సీలపై వివక్ష తగదు: సీపీఐ నారాయణ
cpi natinal secratary narayana told It is painful to look down on sc families
author img

By

Published : Jan 5, 2021, 8:49 PM IST

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు గడిచినా గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్ గ్రామంలో బహిష్కరణకు గురైన 24 ఎస్సీ కుటుంబాలను మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్​తో కలిసి ఆయన పరామర్శించారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎస్సీ కుటుంబాలపై చిన్న చూపు బాధాకరమని నారాయణ అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్సీలను బహిష్కరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సాంఘిక బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.