కొవిడ్ సంక్షోభం మనిషికి ఎన్నో కొత్త దారులను చూపించింది. లాక్‌డౌన్ ఆంక్షల్లో ఆరోగ్యకరమైన జీవితం ఎలా గడపాలి అనే ఆలోచనకు హైదరాబాద్‌కు చెందిన అధ్యాపకురాలు చెన్నమనేని పద్మ కార్యరూపం ఇచ్చారు. సకల సౌభాగ్యాలు ఇచ్చే ఆవు విలువ, గొప్పదనం తెలుసుకున్న ఆమె... ఏకంగా గోశాల నెలకొల్పారు. రసాయన అవశేషాల్లేని పౌష్టికాహారం తీసుకోవాలన్న స్పృహతో ఆవు పేడకు విలువ ఇచ్చి.. గో-ఆధారిత ఉత్పత్తుల తయారీపై విద్యార్థినులకు శిక్షణను ఇస్తున్నారు. ఆర్థిక స్వాలంబన దిశగా వారు ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. దీపావళి పండుగ వేళ.. ప్రమిదలు తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించారు.
2018లో తమ స్వస్థలం జగిత్యాల మండలం రాయికల్ మండల బోర్నపల్లిలో చెన్నమనేని పద్మ సొంత నిధులు వెచ్చించి "మురళీధర గోధామం" పేరిట ఓ గోశాల నెలకొల్పారు. ఆ గోశాలతోపాటు మలక్‌పేటలోనూ గోమయ ఉత్పత్తులకు ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. మలక్‌పేట మహిళా సమాజం, జగిత్యాల జిల్లా బోర్నపల్లి గోశాలలో గో-ఆధారిత ఉత్పత్తుల తయారీలో విద్యార్థినిలకు శిక్షణ ఇస్తూ ఆత్మస్థైర్యం నింపుతున్నారు. నాంపల్లి వనిత మహవిద్యాలయలోని విద్యార్థినులు ఆర్థిక స్వాలంభన సాధించే దిశగా కృషి చేస్తున్నారు.
గో ఆధారిత ఉత్పత్తులు
కరోనా సమయంలో గో-ఆధారిత ఉత్పత్తులు తయారీపై విద్యార్థినులు వారి కాలనీల్లో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆవు పేడతో ప్రమిదలు, గొబ్బెమ్మలు, ఇతర ఉత్పత్తులు తయారీపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. రాజధాని చుట్టు పక్కల సహా జగిత్యాల జిల్లాల్లో 50 గోశాల్లోనే కాకుండా ఇతర చోట్ల 500 కార్యక్రమాల్లో మహిళలు, విద్యార్థులకు శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. గో-ఆధారిత ఉత్పత్తులను గో స్వేచ్ఛ బ్రాండ్‌పై మార్కెటింగ్ చేస్తున్నారు.
దీపావళి, సంక్రాంతి, రక్షాబంధన్ ఇలాప్రతి పండగకు ఓ థీమ్ తీసుకుని గో-ఆధారిత ఉత్పత్తుల తయారీ, వినియోగం, మార్కెటింగ్ అంశాలపై పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చూడండి: Gold Rate Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?