ETV Bharat / state

కొవిడ్‌ విజృంభణ.. ఆలయాల్లో నిరాడంబర వేడుకలు - without devotees pooja

రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణతో ఆలయాల్లో నిరాడంబరంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాల్లో జరిగే వేడుకల్లో భక్తులు పాల్గొనకుండా ఆంక్షలు విధించారు. వేములవాడ రాజన్న ఆలయంలో అంతర్గతంగా రాములోరి కల్యాణం చేయగా.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలోనూ అంతర్గతంగా వేడుకలు నిర్వహించారు.

vemulawada temple, kondagattu anjaneya swamy temple
కొవిడ్‌ విజృంభణ.. ఆలయాల్లో నిరాడంబర వేడుకలు
author img

By

Published : Apr 17, 2021, 1:25 AM IST

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఆలయాల్లో వేడుకలు నిరాడంబరంగా జరుపుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజు రాములోరి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సారి కల్యాణ వేడుకను అంతర్గతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 నుంచి 21 వరకు భక్తుల దర్శనాలను రద్దు చేశారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనూ ఈసారి హనుమాన్‌ జయంతి ఉత్సవాలు, రాములోరి కల్యాణం నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఉత్సవాలు జరగనుండగా... భక్తులు లేకుండానే నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.

గత ఏడాది లాక్‌డౌన్ వల్ల చిన్నహనుమాన్‌, పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలు రద్దయ్యాయి. ఈసారి కూడా ఉత్సవాలు లేకపోవడం వల్ల హనుమాన్‌ దీక్షాపరులు స్థానికంగానే దీక్ష విరమణ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి : కరోనాపై పోరు...కరీంనగర్​లో మాస్క్ వాల్ అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.