జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జగిత్యాల పట్టణంలోని అరవింద్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహమ్మరి బారిన పడగా, సుభాష్‌నగర్‌లో 60 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. కొత్తగా వెలుగు చూసిన 11 కేసులతో కలుపుకుని మొత్తం 152 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం వల్ల జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన వారిని కొందరిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచగా.. మరికొందరికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
ఇవీ చూడండి: అనారోగ్యంతో ఉన్నా విధులకు రమ్మంటున్నారని నర్సుల ఆందోళన