జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. మెట్పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఈరోజు 25 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌గా తేలింది. రాంనగర్‌కు చెందిన ఒకరు, మార్కెట్ ఏరియాకు చెందిన ఇద్దరికి, వాసవి హైస్కూల్ దగ్గర ఒకరికి, బోయవాడలో ఒకే కుటుంబానికి చెందిన 4 గురు వైరస్ బారిన పడినట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 153 మందికి టెస్టులు చేయగా 38 మందికి వైరస్ సోకిందని వెల్లడించారు.
అప్రమత్తమైన పురపాలక అధికారులు వ్యాధిబారినపడిన వ్యక్తుల వార్డుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఆ వీధి ప్రజలకు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ముందస్తుగా పూర్తి జాగ్రత్తలు పాటించాలని పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు.
ఇవీచూడండి : రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక