జగిత్యాల జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల పట్టణంలో ఒకరికి, కొడిమ్యాల మండలం ముగ్గురికి మహ్మరి సోకింది.. కాగా జిల్లాలో ఇప్పటి వరకు కొత్త కేసులతో కలుపుకుని పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది.
వైరస్ బారినపడి నలుగురు మృతి చెందారు.. గత వారం రోజులుకుపైగా ఎలాంటి కేసులు నమోదవ్వకపోవడం వల్ల కాస్త ఊపిరిపీల్చుకున్న జగిత్యాల జిల్లా ప్రజల్లో తాజాగా నాలుగు కొవిడ్ కేసులు నిర్ధరణ అవడం వల్ల ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!