ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ..జగిత్యాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. తహసీల్దార్ చౌరస్తా వద్ద ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరినా సంస్థకు ఎలా మూల్యాంకణ బాధ్యతలు అప్పజెప్పారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.
రెవెన్యూ శాఖ, ఇంటర్ బోర్డులో పొరపాట్లు జరిగాయని ఆ శాఖలను ఎత్తివేయాలని కేసీఆర్ అంటున్నారు. అసలు ఎత్తివేయాల్సింది ఈ తెరాస ప్రభుత్వాన్నే. కేసీఆర్ తన లోపాలను కప్పి పుచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నాడు.
------ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఇవీ చూడండి : అంతర్గత విచారణ కమిటీకి జస్టిస్ రమణ దూరం