ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లోనే నిరసన దీక్ష చేపట్టారు. రైతులు పండించే పంటలకు స్వేచ్ఛ కల్పించాలని కోరారు. అలా కాకుండా వాళ్లని ఇబ్బంది పెడితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలోని అన్నదాతలు నష్టాల పాలు అయ్యే అవకాశం ఉందని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పంటలు వేయడంలో రైతులకు స్పేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు.