జగిత్యాల పురపాలక పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఓట్లను అభ్యర్థించారు. హామీల అమలులో తెరాస ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. సంక్షేమం, అభివృద్ధి కోసం తమ అభ్యర్థులనే భారీ ఆధిక్యతతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : బస్తీమే సవాల్: దుండిగల్‌లో దండిగా ఓట్లు పడేది ఏ పార్టీకి...?