పాకెట్ మనీ కోసం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన కళాశాల విద్యార్థులు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల బస్టాప్ వద్ద సోదాలు నిర్వహించారు. రెండు ద్విచక్ర వాహనాలపై నాలుగు కిలోల గంజాయి తరలిస్తున్న నలుగురిని పట్టుకున్నారు.
కరీంనగర్లో గంజాయి అలవాటు పడిన వారికి విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కరీంనగర్లో చీకటి దందా చేస్తున్నారని ఎస్సై శివక్రిష్ణ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి సారిస్తే ఇలాంటి నేరాలు జరగకుండా ఉంటాయన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.