జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో రెండోరోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రవి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని 20వ వార్డులో పలు రకాల మొక్కలు నాటారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు పాటుపడాలని.. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.
ఇంటికి రెండు మొక్కలి చొప్పున పెంచాలని.. తమ తమ కాలనీలను పచ్చదనంతో తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. పదిరోజుల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పాలనాధికారి తెలిపారు.
ఇదీ చూడండి : 'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'