జగిత్యాల జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వ పథకాల అమలు, ఉత్తమ పాలన అందించి మంచి ఫలితాలు సాధిస్తున్నందుకుగానూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు అవార్డుకు శరత్ ఎంపికయ్యారు. దేశంలో 686 జిల్లా కలెక్టర్ల పనితీరు ఆధ్యాయనం చేసిన కమిటీ శరత్‌ను ఎంపిక చేసింది. గురువారం సాయంత్రం దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అవార్డు ప్రదానం చేయనున్నారు.
అన్నింటా అగ్రగామి
కొత్త జిల్లా ఆవిర్భావంతో జగిత్యాలకు కలెక్టర్‌గా వచ్చిన డాక్టర్ శరత్.... పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వ పథకాలన్నీ విజయవంతం చేసి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపారు. పదోతరగతి ఫలితాల్లోనూ రెండేళ్ల నుంచి రాష్ట్రంలోజగిత్యాల మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. 90 రోజుల్లో 60 వేల మరుగుదొడ్లు నిర్మించి దేశంలోనే ఆగ్రస్థానంలో నిలిచింది.
జిల్లా ప్రజలకు అంకితం
కలెక్టర్ కృషికి రాష్ట్రం ప్రభుత్వం రెండేళ్లుగా ఎక్సలెన్స్ అవార్డుతోసత్కరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛపురస్కార్ అందుకున్నారు. ఉత్తమ కలెక్టర్ ఆవార్డును జిల్లా ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు శరత్ తెలిపారు.
ఇదీ చదవండి:ఓరుగల్లుకు ఎర్రబెల్లి