రంగారెడ్డి జిల్లా జల్పల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ.. మందులు కొనుక్కోలేని పేద వృద్ధులకు పెద్దమనస్సుతో సాయం చేసేందుకు చిన్ని చేతులు కదిలొచ్చాయి. అదే గ్రామంలో నివసిస్తున్న 9వ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ అనే చిన్నారి తన తండ్రి వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారం చూసి తాను పొదుపు చేసుకున్న డబ్బును విరాళంగా ఇచ్చాడు.
తన గల్లాబుడ్డి పగలగొట్టి అందులో ఉన్న రూ. 10 వేల ఒక వందను, అది చూసిన సోదరుడు హర్షవర్ధన్ రూ. 11వందలను వృద్ధుల కొరకు విరాళంగా అందజేశారు. అది చూసిన విష్టు తండ్రి శ్రీనివాస్.. తన తరుఫున రూ. 10 వేల చెక్కును జల్పల్లి కౌన్సిలర్ యాదగిరికి అందించారు. ఇది చూసిన స్థానికులు, పెద్దలు, చిన్నారులను అభినందించారు.
" మా నాన్న వాట్సాప్ గ్రూపులో వచ్చిన మెస్సేజ్ చూసి నా గల్లాలోని డబ్బులును కౌన్సిలర్‌కి ఇచ్చాను- విష్ణువర్ధన్"
ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య