జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో పైపులైన్‌కు భారీ రంధ్రం ఏర్పడి భారీగా త్రాగునీరు వృథాగా పోయింది. పక్కనే ఉన్న దుకాణాలన్నీ నీళ్లతో తడిచిపోయాయి. దుకాణదారులు తడిసిన సామాగ్రిని ఆరబెట్టుకున్నారు. గదులకు చేరిన నీటిని ఎత్తుకుంటూ నానా అవస్థలు పడ్డారు.
పట్టణంలోని ఫిల్టర్బెడ్ నుంచి ప్రధాన పైపులైన్ ద్వారా నీటిని అధికారులు సరఫరా చేసేవారు. మురుగు కాలువల నిర్మాణ పనుల అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాగునీటి పైపు లైన్ పగిలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేసి పనులను ప్రారంభించారు.
ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక