నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం బేల్యతండాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతిచెందాడు. వరి ధాన్యం తీసుకొచ్చేందుకు బాబాయ్ ట్రాక్టర్‌పై బాదావత్ తేజ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. వెళ్లే క్రమంలో పొలం గట్టు మీద నుంచి ట్రాక్టర్ వెళ్లగా.. ప్రమాదవశాత్తు బాలుడు జారిపడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ టైరు బాలుడిపై నుంచి వెళ్లడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'పనికోసం వచ్చినం.. ఆదుకోండి'