జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లాలో ఆదివారం భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ పోలీసులను డిమాండ్ చేశారు.
ఆందోళన విషయం తెెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించమని కోరగా... వినకపోవడం వల్ల పోలీసులు వారిని అరెస్ట్ చేసి మల్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.