ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ.. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట భాజపా ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, జిల్లాలోని భాజపా కార్యకర్తలు హాజరై దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. జీవోను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను రద్దు చేయకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని భాజపా నాయకులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలుస్తారు: బండి సంజయ్