జగిత్యాలలో ఏటా విజయదశమి రోజు శమీపూజ జరిగే జమ్మిగద్దెకు గులాబి రంగు వేయటాన్ని భాజపా, వీహెచ్పీ నాయకులు వ్యతిరేకించారు. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీ రంగును వెంటనే తొలగించాలని వారు నిరసన వ్యక్తం చేశారు.
నాయకుల ఆందోళనతో పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, పురపాలిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్మిగద్దెకు వేసిన గులాబిరంగును వెంటనే తొలగిస్తామని పురపాలిక అధికారులు హామీ ఇవ్వడం వల్ల ధర్నా విరమించారు. పవిత్ర విజయదశమికి చిహ్నంగా నిలిచే శమీపూజ వేదికకు గులాబీరంగు వేయటాన్ని భాజపా, వీహెచ్పీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.