జీహెచ్‌ఎంసీ చట్టసరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న భాజపా కార్యకర్తలను జగిత్యాల జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను ముందే అరెస్ట్ చేయటాన్ని జగిత్యాల జిల్లా భాజపా శాఖ ఖండించింది. వరంగల్‌లో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జీని భాజపా నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్టులు, లాఠీచార్జీలతో ఆందోళనలు ఆగవని హెచ్చరించారు.
ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇద్దరు అంతకన్నా ఎక్కువ పిల్లలున్నా ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని చట్టం చేయడం కోసం అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు గానీ.. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని అమలు చేయడానికి మాత్రం సమయం ఉండదా నాయకులు ప్రశ్నించారు.
జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టు చేసి.. వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు నాయకులను తరలించారు. ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. సమస్యను చెప్పుకోవడానికి అసెంబ్లీకి కూడా వెళ్ళొద్దా అంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ముప్పతిప్పలు పెట్టింది... ఎట్టకేలకు చిక్కింది