ETV Bharat / state

'ఎంపీ అర్వింద్​ చొరవతోనే పసుపు ధరకు రెక్కలు'

రాష్ట్రంలో పసుపు ధరలు పెరగడంపై జగిత్యాల జిల్లా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు కాటిపల్లి గోపాల్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా పసుపు రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. మద్దతు ధర రావడానికి కృషి చేసిన ఎంపీ అర్వింద్​ చిత్రపటానికి భాజపా నాయకులు పాలాభిషేకం చేశారు.

metpally agriculture market, pasupu rates
మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​, పసుపు ధరలు
author img

By

Published : Mar 6, 2021, 5:50 PM IST

కేంద్రం పసుపు దిగుమతి నిలిపివేయడంతోనే.. రాష్ట్రంలో పసుపు పంట ధరలకు రెక్కలొచ్చాయని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​ను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పసుపు మార్కెట్​ను భాజపా నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధరలపై ఆరా తీశారు.

మెట్​పల్లి మార్కెట్​లో కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి గతంలో కంటే పసుపు ధరలు పెరిగాయని గోపాల్​రెడ్డి పేర్కొన్నారు. ధరలు పెరగడానికి కృషిచేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. రైతులకు భాజపా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పండించిన పంటను వివిధ చోట్లకు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించడంతో పసుపు పంటకు మద్దతు ధర పెరుగుతూ వస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఆర్​ఎంపీ ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ.65.11 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.