భారత్ బంద్‌లో భాగంగా జగిత్యాల జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోల్ బంకులు మూసి వేయగా, దుకాణాలు తెరవలేదు. రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ఈ బంద్‌కు అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు, రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు పలికాయి. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా బంద్.. కూడళ్ల వద్ద బందోబస్త్