Bathukamma second day Celebrations: రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఊరూవాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఆవరణలో జరిగిన వేడుకల్లో హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ప్రకృతి ప్రాధాన్యాన్ని బతుకమ్మ పండగ చాటి చెబుతోందని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ వేడుకల్లో మహిళా కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారిణిలు పాల్గొని నృత్యాలు చేశారు.
ఖమ్మంలో సంబురాలు: మేడ్చల్ జిల్లా కీసరలో చీర్యాల ఈడెన్‌గార్డెన్‌లో బతుకమ్మవేడుకలు ఘనంగా సాగాయి. ఆ వేడుకల్లో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖమ్మంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. పలు కాలనీల్లో కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు వాటి ముందు ఆడిపాడారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని ప్రైవేట్‌పాఠశాలలో వేడుకలను ఘనంగా జరిపారు.
జగిత్యాలలో మహిళలతో ఆడిపాడిన కవిత: విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రంఏర్పడిన తర్వాతే బతుకమ్మ పండుగకు విశిష్టత వచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని మినీ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంబురాలకు హాజరయ్యారు. మహిళలతో కలిసి ఆడిపాడారు.
అమెరికాలో బతుకమ్మ ఉత్సవాలు: బతుకమ్మ వేడుకలుఅమెరికాలోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.న్యూజెర్సీలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మహిళలు పాల్గొని ఉయ్యాల పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
ఇవీ చదవండి: