Bandi Sanjay Padayatra in Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్.. ఘాట్ రోడ్డు వద్ద ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆ దుర్ఘటనలో చనిపోయిన వారి ఫ్లెక్సీలను పరిశీలించారు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో 64 మంది చనిపోతే కనీసం పరామర్శించాలన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిని పరామర్శించని కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు.
"కొండగట్టు బాధితులను సీఎం ఆదుకుంటే పాలాభిషేకం చేస్తా.. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటికీ ఆర్థికసాయం అందలేదు. మరణించిన వారి కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదు. కొండగట్టు వద్దప్రమాద నివారణకు చర్యలు శూన్యం. గోడ నిర్మాణం మినహా ప్రమాద నివారణకు చర్యలు తీసుకోలేదు. బాధితులను ఆదుకోని కేసీఆర్.. కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తారా?"- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: