ETV Bharat / state

సినీ ఫక్కీలో కార్యాలయంపై దాడి... మంటల్లో ఫర్నిచర్

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని మూర్తి డిజిటల్​ కమ్యూనికేషన్​ కార్యాలయంలోకి సినీ ఫక్కీలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి భారీ ఎత్తున ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. దుండగులు వెళ్లిన తర్వాత పోలీసులు ధీమాగా వచ్చారంటూ స్థానికులు మండిపడుతున్నారు.

author img

By

Published : Oct 15, 2020, 11:44 PM IST

attack on office in cinematic way at jagityal district
సినీ ఫక్కీలో కార్యాలయంపై దాడి... మంటల్లో ఫర్నిచర్

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని పాత బస్టాండ్​ వద్ద ఖాదీ కాంప్లెక్స్​లో నూతనంగా ప్రారంభించిన మూర్తి డిజిటల్​ కమ్యూనికేషన్​ కార్యాలయంలో సినీ ఫక్కీలో దాడి జరిగింది. సుమారు 30 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్​ను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు ఫర్నిచర్​ను కుప్పగా పోసి నిప్పంటించారు. 40 నిమిషాలకు పైగా ఘటన జరుగుతున్నా ఒక్క పోలీస్​ కూడా రాకపోవడం వల్ల దాడికి వచ్చిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి అడ్డం వచ్చిన వారిపైనా దాడికి పాల్పడ్డారు.

ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాత్రికేయులపైనా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వారు ఫొటోలు తీసిన చరవాణులను నిప్పులో వేశారు. గొడవంతా అయిపోయాక... దాడికి పాల్పడిన వ్యక్తులు వెళ్లిపోయాక.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్యాలయంలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని ప్రవీణ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

attack on office in cinematic way at jagityal district
ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాను దాచేసిన చిత్రం

ఇదీ చదవండీ...ఇది స్పాంజిలా కుంగిపోయే నేల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.