ETV Bharat / state

'ఈరోజు అమావాస్య సార్.. అందుకే మా పిల్లలను స్కూల్​కు పంపలేదు' - పాఠశాలల రీఓపెన్

Amavasya Effect on Schools: సంక్రాంతి సెలవులు, కరోనా మూడోదశ అప్రమత్తతలో భాగంగా… మూతపడిన పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ తెరుచుకున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ… బడులు తెరిచారు. కానీ అక్కడ పిల్లలు మాత్రం పాఠశాలలకు వెళ్లలేదు. ఎందుకు రాలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులను.. ఉపాధ్యాయులు ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలు విని షాక్​ అయ్యారు. ఈ రోజు అమావాస్య అని.. అందుకే పిల్లలను బడికి పంపించలేదని చెప్పడంతో ఉపాధ్యాయులు కంగుతిన్నారు.

Amavasya Effect on Schools
Amavasya Effect on Schools
author img

By

Published : Feb 1, 2022, 4:58 PM IST

Amavasya Effect on Schools: 24 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చారు. కానీ విద్యార్థులు మాత్రం హాజరుకాలేదు. ఎందుకురాలేదో తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించారు. వారు చెప్పిన సమాధానాలు విని షాక్​కు గురయ్యారు. ఈ రోజు అమావాస్య అని.. అందుకే స్కూలుకు పంపలేదని కొందరు చెప్తే.. కరోనా ప్రభావం తగ్గాక పంపిస్తామని మరికొందరు బదులిచ్చారు.

కొత్త బస్టాండ్ సమీపంలోని ఉన్నత పాఠశాలలో 112 మంది విద్యార్థులకు కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. చావిడి ప్రాంతంలోని నూతన ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు గాను కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో 336 మందికి 31 మంది విద్యార్థులే స్కూలుకు వచ్చారు. బంటుపేట బాలుర ఉన్నత పాఠశాలలో 300 పైచిలుకు విద్యార్థులుండగా.. కేవలం 21 మంది మాత్రమే స్కూల్ కి వచ్చారు. శివాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో 182 మంది విద్యార్థులకు గాను.. తొమ్మిది మంది విద్యార్థులే హాజరయ్యారు. ఏ తరగతిగది చూసిన విద్యార్థులు లేక ఖాళీ బల్లలు దర్శనమిచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించినా... అమావాస్య మాత్రం అడ్డుతగిలింది.

ఇదీ చూడండి: రాష్ట్రాలకు లక్ష కోట్ల సాయం- వడ్డీ లేని రుణం!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.