కేంద్ర హోంశాఖను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మరోసారి ఆశ్రయించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ ద్వంద్వ పౌరసత్వంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్‌పై ఆది శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో హోంశాఖ అధికారులను కలిసి రివిజన్ పిటిషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ వేశారు. జులై 10న రమేష్ పౌరసత్వంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చూడండి: 'ఆర్టికల్ 370'.... అయ్యంగార్ విరచితం!