ETV Bharat / state

'కేసీఆర్​ తాత.. మా నాన్నను ఆదుకోండి'

'పాఠశాల మూత పడటంతో మా ఇల్లు గడవడం కష్టంగా మారింది.. మా నాన్న లాంటి ఎంతో మంది ప్రైవేటు టీచర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. కేసీఆర్​ తాత.. మీరే వారందరినీ ఆదుకోవాలి... ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేయాలి..' జగిత్యాల జిల్లాలోని ఓ ప్రైవేటు టీచర్ కూతురి ఆవేదన ఇది. స్థానిక ఉపాధ్యాయులంతా కలిసి బడుల మూసివేతకు.. నిరసన తెలుపుతున్న సమయంలో.. పాప ప్లకార్డు ప్రదర్శించింది.

private teacher's daughter Consciousness
ప్రైవేటు​ టీచర్ కూతురి ఆవేదన
author img

By

Published : Mar 31, 2021, 5:39 AM IST

కరోనా కారణంగా మరోసారి ప్రైవేటు పాఠశాలల మూసివేత.. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. జీతాల్లేక రోడ్డున పడుతున్నామంటూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని టీచర్ల నిరసన కార్యక్రమంలో.. ఓ పాప ప్లకార్డు ప్రదర్శన స్థానికులను ఆలోచింపజేసింది. ఉద్యోగం కోల్పోయిన తన తండ్రిని ఆదుకోవాలని విన్నవిస్తూ.. ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడి కూతురు, సీఎంను వేడుకున్న విధానం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

'పాఠశాల మూతపడటంతో మా ఇల్లు గడవడం కష్టంగా మారింది.. మా నాన్న లాంటి ఎంతో మంది ప్రైవేటు టీచర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. కేసీఆర్​ తాత.. మీరే వారందరినీ ఆదుకోవాలి... ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేయాలంటూ..' సురేందర్ అనే ఉపాధ్యాయుడి కుమార్తె ప్రణవి.. సీఎంకు విన్నవించుకుంది. ప్లకార్డు ప్రదర్శన చేస్తూ.. ఆవేదన వ్యక్తం చేసింది.

నిరసన అనంతరం.. ఉపాధ్యాయులంతా కలిసి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. తహసీల్దార్​తో పాటు ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందించారు. తమ సమస్యలను వివరించి.. పాఠశాలలను తెరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.