జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపల్లి చోళేశ్వర్ గాంధీ జయంతి సందర్భంగా సైకత శిల్పాన్ని వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ పాఠశాలలో చోళేశ్వర్ ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్నాడు.
శిల్పాన్ని వేసేందుకు గంట సమయం పట్టిందని చోళేశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు వరకు 800 సూక్ష్మ శిల్పాలు చేసి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్, రాయల్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సంపాదించుకున్నారు.
ఇదీ చూడండి: హుస్సేన్‌సాగర్ నీటి నాణ్యత మెరుగుకు అంతర్జాతీయంగా టెండర్లు