ETV Bharat / state

పొలంలో విద్యుదాఘాతంతో రైతు మృతి - Jagityala District Latest News

పొలంలో పంటకు మందులు చల్లుతుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సిరిపూర్ శివారులో జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Farmer dies of electric shock on farm
పొలంలో విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Mar 8, 2021, 2:02 PM IST

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్​ శివారులో విషాదం చోటుచేసుకుంది. పంటకు మందులు చల్లుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. నడికుడ గ్రామానికి చెందిన భూక్య రాజ్​నాయక్ ఉదయాన్నే పొలంలో మందులు చల్లుతున్నాడు.

పొలం మధ్యలో తెగిపడి ఉన్న కరెంట్ తీగలు అతనికి తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని మెట్​పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వైర్లు మొత్తం జాయింట్​లు వేసి ఉన్నాయని.. అక్కడే తెగిపోయినట్లు చెప్పారు. మృతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ఘటనతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్ఖానికులు కోరారు.

ఇదీ చూడండి: ఆర్మీ జవాను బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.