ETV Bharat / state

వానాకాలం చదువులపై స్పందించిన కలెక్టర్​

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శిథిలమైపోతున్న భవనాలపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్​ శరత్​ స్పందించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థినుల అవస్థలను చూశారు. నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వానాకాలం చదువులపై స్పందించిన కలెక్టర్​
author img

By

Published : Aug 3, 2019, 10:50 PM IST

వానాకాలం చదువులపై స్పందించిన కలెక్టర్​

400 మందికి పైగా చదువుకుంటున్న జగిత్యాల జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సరైన వసతుల్లేక విద్యార్థినుల అవస్థలు వర్ణణాతీతం. శిథిలమైపోయిన భవనాల్లో... వర్షమొస్తే గొడుగు వేసుకుని... ఎండ కాస్తే చెమటతో తడిచిపోతూ ఎప్పుడు ఏ భవనం కూలిపోతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్న ఆ విద్యార్థినుల కష్టాన్ని ఈటీవీ భారత్​ 'వానకాలం చదువులంటే ఇవేనేమో' అనే శీర్షికతో వెలుగులోకి తెచ్చింది.

అలా వెలుగులోకి వచ్చింది.... ఇలా స్పందన వచ్చింది

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్​ శరత్​ ఇంజినీరింగ్​ అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల్లో విద్యార్థినుల అవస్థలు ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. సాధ్యమైనంత త్వరలోనే నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ఇబ్బంది కలగకుండా సోమవారం నుంచే భవనాల మరమ్మతులు చేయిస్తామన్నారు. కలెక్టర్​ స్పందనపై విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని సంతోషంగా ఉన్నారు.

ఇదీ చూడండి: వానకాలం చదువులంటే ఇవేనేమో..!

TG_Hyd_64_03_Gurukula Students Abhinanda Sabha_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తెలంగాణ రాష్ట్ర గురుకులాలలో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యార్థుల ఉపాధ్యాయులకు... ఈ నెల 4న ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ' ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేయనున్నట్లు స్వేరోస్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కాంపల్లి ఊశన్న తెలిపారు. గురుకులాలలో విద్యనభ్యసించి ఎంబీబీఎస్ , ఐఐటీ , ఎన్ఐటీ , బీడీఎస్ చదివి స్థిరపడిన విద్యార్థుల గురువులకు ఆత్మీయ అభినందన సభను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లో చెప్పారు . ఈ సభకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణయ్య , ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ , తెలంగాణ ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనారిటీ గురుకులాల సొసైటీల కార్యదర్శిలు ఆర్ఎస్ . ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరవుతారని వెల్లడించారు . బైట్: కాంపల్లి ఊశన్న, స్వేరోస్ ఇంటర్నెషనల్ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.