ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో మరో 4 కరోనా కేసులు

author img

By

Published : Jun 2, 2020, 5:36 PM IST

రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులతో జగిత్యాల జిల్లా ఆందోళనకరంగా మారింది. ఈరోజు మరో నలుగురికి పాజిటివ్​గా తేలగా... మొత్తం కేసులు 68 గా అధికారులు వెల్లడించారు.

4 new corona cases in jagityal district
జగిత్యాల జిల్లాలో మరో 4 కరోనా కేసులు నమోదు

జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 4 కేసులు నమోదయినట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వెల్లడించారు. ధర్మపురి మండలంలో ఒకరికి, ఇబ్రహీంపట్నం మండలంలో ముగ్గురికి కరోనా సోకినట్లు తెలిపారు.

నలుగురు బాధితులు ముంబయి నుంచి వచ్చిన వారేనని అధికారులు గుర్తించారు. బాధితులందరినీ గాంధీకి తరలిస్తున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 68 కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.