జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి పేరుకు జిల్లా ఆస్పత్రి... రోజుకు 400కు పైగా రోగులు ఓపీ వస్తుండగా... 150కి పైగా ఐపీ కేసులు వస్తాయి. ఇంత పెద్ద ఆస్పత్రిలో శవాలను భద్రపరచేందుకు ఒకటే ఫ్రీజర్ ఉండటం రోగులను కలవరపరుస్తోంది. మంగళవారం మూడు మృతదేహాలను ఒకే దాంట్లో తుక్కును తొక్కినట్లుగా కుక్కారు. ఇది చూసిన మృతుల బంధువులు మరింత ఆందోళనకు గురయ్యారు.
గత పది రోజులుగా ఓ గుర్తు తెలియని మృతదేహం మార్చురీలో ఉండగా.. మంగళవారం ఒకే రోజు రెండు మృతదేహాలు వచ్చాయి. మరో ఫ్రీజర్ లేనందున ఆస్పత్రి సిబ్బంది ఒక దాంట్లోనే ముగ్గురిని కుక్కింది. దయనీయ పరిస్థితిని చూసిన స్థానికులు.. ఉన్నతాధికారులు వెంటనే అదనపు ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండిః 'తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరు'