zonal employees transfer process : జిల్లా కేడర్లో ఉపాధ్యాయులు మినహా మిగతా ఉద్యోగుల్లో 14 వేల మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వారు మూడు రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లా కేడర్లో మిగిలిన వారి బదిలీల ప్రక్రియను కూడా సోమవారం వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం పరస్పర బదిలీలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
అటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగులకు సంబంధించి అప్పీళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. అప్పీళ్లతో పాటు భార్యాభర్తలకు సంబంధించిన స్పౌస్ కేసుల పరిశీలనా ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఖాళీ ఉంటేనే ఈ తరహా కేసులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో చాలా మందికి సర్దుబాటు అవకాశం లేదని అంటున్నారు. అప్పీళ్లు, స్పౌస్ కేసుల పరిష్కారం పూర్తయిన వెంటనే జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగుల బదిలీకి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ఇదీ చూడండి: TS New zonal system : ఆ శాఖ మినహా జోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి