ETV Bharat / state

కట్టెలకు బదులుగా పిడకలు: యుగతులసి ఫౌండేషన్​ - తెలంగాణ తాజా వార్తలు

షిర్డీ సాయినాథుని పవిత్ర ధునిలో కట్టెల బదులుగా గో పిడకలను వినియోగించడానికి పంపిస్తున్నట్లు యుగతులసి, గో సేన ఫౌండేషన్ పేర్కొంది. ప్రకృతిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

yuga tulasi
yuga tulasi
author img

By

Published : May 17, 2021, 3:36 PM IST

రోజురోజుకు కలుషితమవుతున్న ప్రకృతిని కాపాడుకునేందుకు యుగతులసి, గో సేన ఫౌండేషన్​ శ్రీకారం చుట్టింది. షిర్డీ సాయినాథుని పవిత్ర ధునిలో కట్టెల బదులుగా గో పిడకలను వినియోగించడానికి పంపిస్తున్నట్లు ఫౌండేషన్​ ఛైర్మన్​, టీటీడీ పాలకమండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్​ తెలిపారు.

ఈ సందర్భంగా ఖైరతాబాద్​ మింట్​ కాంపౌండ్​లోని శ్రీత్రిశక్తి హనుమాన్ దేవస్థానం నుంచి షిర్డీకి వెళ్లే గో పిడకల ట్రక్కును శివకుమార్ ప్రారంభించారు. చెట్లను నరికి మొద్దులను ధునిలో కాల్చే ప్రక్రియను ఆపి.. సహాజసిద్ధమైన పిడకలను వాడాలని షిర్డీ సంస్థాన్​ అధికారులు సూచించినట్లు.. దానికి వారు సమ్మతించారని పేర్కొన్నారు.

ఈ పిడకలను కాల్చడం వల్ల ఆక్సిజన్​ ఉత్పత్తి కావడమే కాకుండా.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసినవాళ్లమవుతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాయిబాబా ఆలయాల్లో నిత్యం ధునిలో కాల్చే చెట్ల కట్టెలకు బదులు పిడకలు వాడే విధంగా గోశాల నిర్వహకులు సహకరించాలని శివకుమార్​ కోరారు. అలాగే భవిష్యత్తులో స్మశానవాటికలో దహనం చేసే మృతదేహాలకు కట్టెలకు బదులు పిడకలతో దహనం చేసే విధంగా సన్నహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.