ETV Bharat / state

అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ - తితిదే పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివ కుమార్

దేశంలో గోహత్యలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని... యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మెన్, తితిదే పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివ కుమార్ మండిపడ్డారు. పూజారులు, గోసేవకులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

daily commodities distribution in hyderabad
అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : May 22, 2021, 11:59 AM IST

గోహత్యలు పెరిగిపోవడం వల్లనే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మెన్, తితిదే పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, గోసేవకులకు యుగ తులసి, గోసేవ ఫౌండేషన్ సభ్యులు నిత్యావసర సరుకులను అందజేశారు.

హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని శ్రీ త్రి శక్తి హనుమాన్ దేవస్థానం వద్ద 100 మంది పూజారులకు, గో సేవకులకు 25 కిలోల బియ్యం, పప్పు , నూనె తదితర నిత్యావసర సరుకులను కొలిశెట్టి శివ కుమార్ పంపిణీ చేశారు. కరోనా నియంత్రణ అయ్యే వరకు ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరూ బయటకు రావొద్దని శివ కుమార్ కోరారు.

ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.