ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే ముంపునకు ఎలా గురైందో సీఎం చెప్పాలి' - kcr latest news

Sharmila Fire On Kcr: ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ మూడేళ్లకే ఎలా ముంపునకు గురైందో చెప్పాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆమె విమర్శించారు.

వైఎస్‌ షర్మిల
వైఎస్‌ షర్మిల
author img

By

Published : Aug 3, 2022, 5:28 PM IST

Sharmila Fire On Kcr: ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ మూడేళ్లకే ఎలా ముంపునకు గురైందో చెప్పాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవినీతికి కాళేశ్వరం సాక్ష్యమని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టుపై జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో తెలంగాణ చీఫ్‌ ఇంజనీర్‌ను కలిసి షర్మిల వినతిపత్రం అందజేశారు.

అనంతరం చీఫ్‌ ఇంజనీర్‌ను నుంచి సరైనా సమాధానం రాలేదని ఆరోపిస్తూ.. కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. పేదల కడుపుకొట్టి బడా కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకు తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం, కాంట్రాక్టర్లు లాభపడ్డారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై విచారణ జరపించాలని కోరనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.

"ఈ రెండు మూడేళ్లకే బాహుబలి మోటార్లు మునిగిపోయాయి. పంపుహౌస్​ల ఎత్తు చూడకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దేశ చరిత్రలో ఒక ఎకరాకు నీరు అందించని ప్రాజెక్టు కాళేశ్వరం. సీఎం కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే అతిగొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. బాహుబలి మోటార్లు అన్నారు. ఏమైంది మూడేళ్లకే మునిగిపోయింది." -వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

అసలేెం జరిగిదంటే: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం పంపుహౌస్‌లోని పంపులు, మోటార్లు మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిపై అంచనా వేయడంలో నీటిపారుదలశాఖ నిమగ్నమైంది. అన్ని పంపులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తోంది. గతంలో మునిగిన కల్వకుర్తి పంపుహౌస్‌, శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లు, కాళేశ్వరంలో పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన పనులపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది.

మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లలో 29 పంపులు, మోటార్లు ఉన్నాయి. గోదావరికి గతంలో వచ్చిన అత్యంత గరిష్ఠ నీటిమట్టానికి మించి వరద రావడంతోపాటు, భారీవర్షాల వల్ల వాగులు, వంకల ప్రవాహం వెల్లువెత్తడంతో మేడిగడ్డలోని 17, అన్నారంలోని 12 మోటార్లు నీటమునిగాయి. కాళేశ్వరం వద్ద గరిష్ఠ వరద 20 గంటలకు పైగా ఉండటంతో పంపుహౌస్‌లోకి నీరు రాకుండా చూడటానికి సిబ్బంది ప్రయత్నించారు. సీపేజీ ఉండటం, వర్షాల వల్ల పైనుంచి వచ్చిన వరద నీటితో మునిగిపోయింది.

కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే ముంపునకు ఎలా గురైందో సీఎం చెప్పాలి

ఇవీ చదవండి: పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తాం: బండి సంజయ్

'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'.. ప్రజలకు కేంద్రం కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.