తన భర్తకు ఏమైనా జరిగితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి బాధ్యులని వైకాపాకు చెందిన పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతి అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు తన భర్త భాస్కర్‌ను అడ్డగించి బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి అండగా ఉంటూ.. పార్టీ కోసం కృషి చేస్తున్న తన భర్తపై బెదిరింపులకు దిగటం సరికాదన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే రాచమల్లు డబ్బులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు ఆయన వర్గీయుల ద్వారా వేధిస్తున్నారన్నారు.
ఇవీ చదవండి: